నానీతో అనుపమ? | Talking about Anupama Parameshwaran to act in a film opposite Nani. | Sakshi
Sakshi News home page

నానీతో అనుపమ?

Published Thu, Aug 10 2017 12:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

నానీతో అనుపమ?

నానీతో అనుపమ?

‘అ ఆ’, ‘ప్రేమమ్‌’లో కీలక పాత్రల్లో అలరించి, ‘శతమానం భవతి’తో కథానాయికగానూ ఆకట్టుకున్నారు  . ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోన్న ఈ మలయాళీ బ్యూటీ ప్రస్తుతం రామ్‌ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా నాని సరసన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారని టాక్‌.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ పేరుతో నాని ఓ సిన్మా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో అనుపమను హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ చిత్రంలో ఆమె మోడ్రన్‌గా కనిపించనున్నారని సమాచారం. చూడబోతుంటే అనుపమ నెమ్మదిగా తెలుగులో బిజీ అవుతున్నట్లనిపిస్తోంది. అసిన్, మీరా జాస్మిన్, నిత్యామీనన్, నయనతార తదితర మలయాళ కుట్టీలు తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌ కాగలిగారు. అనుపమ కూడా ఆ లిస్టులో చేరతారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement