పన్నెండేళ్లకు కుదిరింది - ‘దిల్ ’ రాజు | Sharwanand's Shatamanam Bhavathi Movie Launch | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్లకు కుదిరింది - ‘దిల్ ’ రాజు

Published Sun, Aug 28 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

పన్నెండేళ్లకు కుదిరింది  - ‘దిల్ ’ రాజు

పన్నెండేళ్లకు కుదిరింది - ‘దిల్ ’ రాజు

శర్వానంద్ కథానాయకుడిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. శనివారం ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ సత్య రంగయ్య క్లాప్ ఇవ్వగా, ఆయన మనవడు రంగా యశ్వంత్ కెమేరా స్విచాన్ చేశారు.
 
  సత్య రంగయ్య మనవడు ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘పన్నెండేళ్ల క్రితం శర్వానంద్ హీరో కావాలనుకున్నప్పుడు దర్శకుడు తేజకు పరిచయం చేశా. ఇప్పటికి మా సంస్థలో చేయాలని రాసి పెట్టుందేమో. మూడు తరాలకు సంబంధించిన కథ ఇది. ‘శతమానం భవతి’ టైటిల్‌లోనే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది.
 
  యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాం. సెప్టెంబర్ 14న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ‘‘టైటిల్ కార్డ్స్‌లో మా సినిమాలో పాత్రలన్నీ కల్పితం అని వేస్తారు. ఈ సినిమా కల్పితం కాదు, ఓ జీవితం. ‘దిల్’రాజుగారు చెప్పిన కరెక్షన్స్ వలన స్క్రిప్ట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement