మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమపరమేశ్వరన్‌తో పాటు కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోందని ఈ చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం కౌంట్‌డౌన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. కానీ సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఈగల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం గమనార్హం. కానీ సంక్రాంతి రేసులో భారీగా చిత్రాలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ కొరత ఏర్పడింది. మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్,వెంకటేష్ సైంధవ్, నా సామిరంగా వంటి చిత్రాలు ఉండటంతో రేసు నుంచి తప్పకుంటే బెటర్ అని ఈగల్ టీమ్ ఆలోచిస్తుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈగల్... ఇన్నీ సినిమాల మద్య వస్తే థియేటర్స్ కొరత ఏర్పడి నష్టాలు రావచ్చని వారు అంచనా వేస్తున్నారట. సినీ విశ్లేషకులు కూడా ఇదే సరైన నిర్ణయం అని వ్యాఖ్యానిస్తున్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్- రవితేజ కాంబోలో గతేడాది 'ధమాకా' చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈగల్ కూడా భారీ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో సంక్రాంతి నుంచి ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు సోషల్‌మీడీయాలో ప్రచారం జరుగుతుండటంతో రవితేజ ఫ్యాన్స్ కొంతమేరకు నిరుత్సాహానికి గురి అయ్యారు. ఈగల్ సినిమా వాయిదా దాదాపు ఖాయం.. కానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment