మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'ఈగల్'. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాఖీ కట్టింది. ఈ వేడుకలో స్టేజీపైకి వచ్చిన అనుపమ డైరెక్టర్‌ను అన్నయ్య అని పిలిచింది. వెంటనే రవితేజ.. 'నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు.. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో' అని చెప్తాడు.
ఆ వెంటనే అనుమప కూడా సారీ రవిగారు.. 'దర్శకుడు కార్తీక్‌తో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. మొదటి నుంచి ఆయన్ను అన్నయ్య అనే నేను పిలుస్తున్నాను అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్చుకోలేను.' అని చెప్పింది. ఇంకేముంది ఈ లోపు యాంకర్ సుమ ఓ రాఖీ తీసుకొచ్చి అన్నయ్యకు కట్టేయమని చెప్పింది. దీంతో స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్‌కి అనుమప రాఖీ కడుతుంది.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. గతంలో డైరెక్టర్ కార్తీక్ చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. ప్రేమమ్,కృష్ణార్జున యుద్ధం,చిత్రలహరి,నిన్ను కోరి,కార్తీకేయ,ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా వర్క్ చేశాడు. దీంతో అనుపమతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment