కృష్ణార్జున యుద్ధంలో అనుపమా..! | Nani to romance Anupama parameshwaran | Sakshi
Sakshi News home page

కృష్ణార్జున యుద్ధంలో అనుపమా..!

Published Tue, Aug 8 2017 12:11 PM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

కృష్ణార్జున యుద్ధంలో అనుపమా..!

కృష్ణార్జున యుద్ధంలో అనుపమా..!

వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు.  ప్రస్తుతం ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్లో బిజీగా ఉన్న నాని, తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించనున్నాడు. నానీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.

అ..ఆ.. సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అనుపమా తరువాత ప్రేమమ్, శతమానం భవతి లాంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అనుపమా ఆ సినిమా తరువాత నాని సినిమా యూనిట్తో జాయిన్ అవుతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement