
అనుపమా పరమేశ్వరన్,రామ్
ఒక అబ్బాయి.. అమ్మాయి వెనకే పడుతున్నాడు. ఉదయం, సాయంత్రం తన చుట్టూనే తిరుగుతున్నాడు. తన మనసును గెలుచుకోవడమే అతని టార్గెట్. ఇదంతా ప్రేమ కోసమే అంటోంది ‘హలో గురూ ప్రేమ కోసమే..’ చిత్రబృందం. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే...’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రామ్ బర్త్‌డే (మే 15) స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎనర్జిటిక్ హీరో రామ్‌ని కొత్త కోణంలో చూపించే చిత్రం ఇది. జూన్ ఫస్ట్ వీక్‌లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ఆడియన్స్‌ను తప్పకుండా అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ.
Comments
Please login to add a commentAdd a comment