
ఎనర్జిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. రామ్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన మూవీ యూనిట్ టీజర్‌తోనూ అదరగొట్టేసింది. ‘చూశావా... నీ కోసమే కాఫీ..’ అంటూ అనుపమ వాయిస్‌తో మొదలై... రామ్ సమాధానంతో టీజర్ ముగుస్తుంది. వీరిద్దరి మధ్య సంభాషణలకు తోడు.. బ్యాక్‌గ్రౌండ్‌లో దేవి శ్రీ మ్యూజిక్ వింటుంటే.. పేరుకు తగ్గట్టుగానే ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఫుల్ టూ రొమాంటిక్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
కాగా ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment