
‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా లుక్ టెస్ట్‌లో రామ్
ఉన్నది ఒకటే జిందగీ తరువాత రామ్ చేస్తున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమా ఈ సినిమాకు దర్శకుడు. దిల్ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాలో రామ్ లుక్ ఎలా ఉండబోతోందో రివీల్ అయ్యింది. ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్, లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో రామ్ ఫార్మల్ డ్రెస్సింగ్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మార్చి 8న ప్రారంభమైన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది.
After a great sched..here’s a random pic from the look test.. #love #HelloGuruPremaKosame #HGPK pic.twitter.com/cJehwSyRu7
— Ram Pothineni (@ramsayz) 17 March 2018
Comments
Please login to add a commentAdd a comment