కీర్తి సురేశ్ పవర్‌ఫుల్‌ పాత్రలో వస్తోన్న సైరన్.. రిలీజ్ ఎప్పుడంటే? | Kollywood Hero Jayam Ravi, Keerthy Suresh And Anupama Parameshwaran Comments In Siren Movie Press Meet - Sakshi
Sakshi News home page

Siren Movie: కీర్తి సురేశ్ పవర్‌ఫుల్‌ పాత్రలో వస్తోన్న సైరన్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Fri, Feb 9 2024 3:06 PM | Last Updated on Fri, Feb 9 2024 3:52 PM

Kollywood Hero Jayam Ravi and Keerthy Suresh Siren Movie Press Meet  - Sakshi

కోలీవుడ్ హీరో జయంరవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్‌. హోమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై సుజాత విజయకుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించిన సైరన్‌ చిత్రం ఈనెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చైన్నెలోని పీవీపీ స్టూడియోలో  ప్రెస్ మీట్ నిర్వహించారు.

హీరో జయంరవి మాట్లాడుతూ.. తాము సమష్టిగా శ్రమించిన సైరన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్‌ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని.. ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కీర్తీసురేశ్ చాలా బలమైన పాత్రను అద్భుతంగా చేశారని అభినందించారు. తాను ఇందులో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించానని.. ఈ చిత్రం పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని జయంరవి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సుజాత విజయకుమార్‌ మాట్లాడుతూ.. అంబులెన్స్‌ సైరన్‌కు, పోలీస్‌ సైరన్‌కు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రమని అన్నారు. జయంరవి కథానాయకుడిగా సైరన్‌ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తన అల్లుడు అని చెప్పడం కాదు కానీ.. చాలా అద్భుతంగా నటించారని అన్నారు. కీర్తీసురేశ్ ఈ చిత్రంలో పోలీసు అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రను జయంరవికి ధీటుగా నటించారని ప్రశంసించారు. అనుపమ పరమేశ్వరన్‌ కూడా చాలా చక్కగా చేశారని చెప్పారు. దర్శకుడు తనకు చెప్పిన కథ వేరు.. జయంరవికి చెప్పి చేసిన సైరన్‌ చిత్ర కథ వేరని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, అళగర్‌ పెరుమాళ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement