
తెరపై హాట్‌గా కనిపించడం చాలా కష్టమని అంటోంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. ‘డీజే టిల్లు’ కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. ఇందులో అనుమప గ్లామర్ డోస్ పెంచిందనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా వాటిపై అనుపమ స్పందించింది.

‘తెరపై ఒక అమ్మాయిన హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో ‘టిల్లు స్వ్యేర్’ ద్వారా అర్థమైంది. చూసిన వాళ్లకి గ్లామర్ పాత్రలో నటించడం ఈజీ అని అనుకుంటారు. కానీ అలాంటి పాత్రలు చేయడం చాలా కష్టం

. కొన్ని కాస్ట్యూమ్స్ స్క్రీన్‌పై చూడడానికి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. కానీ వాటిని ధరించి.. అందరి ముందు నిలబడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు

కొన్ని క్యాస్ట్యూమ్స్‌కు మొత్తం అద్దాలతో చేసిన వర్క్ ఉంటుంది. అవి ధరించేటప్పుడు చర్మానికి గీసుకుపోతాయి. అవన్నీ భరిస్తేనే తెరపై అందంగా కనిపిస్తాం.

ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసమే చాలా మంది నటీమణులు ఇలాంటి గ్లామర్ పాత్రలు చేస్తున్నారు అని అనుపమ చెప్పుకొచ్చింది

రౌడీ బాయ్స్ చిత్రం నుంచి అనుపమ పాత్రల ఎంపికలో వైవిధ్యం కనిపిస్తోంది. అంతకు ముందు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ మలయాళ భామ.. రౌడీ బాయ్స్‌లో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా చేసి అందరికి షాకిచ్చింది.

ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు

తాజాగా టిల్లు స్వ్వేర్‌తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. పోస్టర్స్‌లోనే కాదు.. ట్రైలర్స్, సాంగ్స్‌లో అనుపమలోని గ్లామర్ కోణం కనిపిస్తుంది.

పాత్ర డిమాండ్ కోసమే అలా చేశానని.. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తన పాత్ర గురించే చర్చిస్తారని అనుపమ ధీమా వ్యక్తం చేస్తోంది.
