
పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు

అలాంటి చిరంజీవి చేత ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డు గెలుచుకోవడం లాంటిది. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' చిత్రం బృందం ఆ ఘనతను సాధించింది

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు

భారీ అంచనాలతో 'టిల్లు స్క్వేర్' సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం

బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన 'టిల్లు స్క్వేర్' చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర బృందాన్ని తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించడం విశేషం

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు

'డీజే టిల్లు' తనకు బాగా నచ్చిన చిత్రమని, ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కూడా ఎంతగానో నచ్చిందని చెప్పిన చిరంజీవి, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు











