కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఓన్లీ మ్యాజిక్
టిల్లు స్క్వేర్‌లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్‌తోనే బాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్‌టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్‌లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్.
కథేంటంటే?
పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్‌లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది.
కలెక్షన్స్ ఎంతంటే?
మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్‌గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్‌కు ఎలాంటి ఢోకా లేనట్లే!
CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow
— BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024
Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC
చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది?
Comments
Please login to add a commentAdd a comment