బోల్డ్‌నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్ | Anupama Parameswaran Comments On Bold Role In Tillu Square Movie | Sakshi

Anupama Parameswaran: ఇంత బోల్డ్‌ క్యారెక్టర్ చేయడానికి కారణం అదే

Mar 19 2024 8:13 AM | Updated on Mar 19 2024 8:47 AM

Anupama Parameswaran Comments On Bold Role In Dj Tillu 2 Movie - Sakshi

కొందరు హీరోయిన్లని చూస్తే కుందనపు బొమ్మల్లా కనిపిస్తుంటారు. అందుకు తగ్గ పాత్రలే చేస్తుంటారు. 'అఆ','శతమానం భవతి' తదితర చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన అనుపమ.. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కోసం మాత్రం రెచ్చిపోయింది. ముద్దు సన్నివేశాలు, గ్లామర్ విషయంలో ఎలాంటి అడ్డు చెప్పలేదని టీజర్, పాటల్లాంటివి చూస్తే అర్థమైపోయింది. అయితే ఇలా ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయం ఇప్పుడు బయటపెట్టింది.

మార్చి 29న 'టిల్లు స్క్వేర్' మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా 'ఓ మై లిల్లీ' అనే పాట రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా.. టీమ్ అంతా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మిగతా వాటి సంగతి పక్కనబెడితే అనుపమ.. బోల్డ్ క్యారెక్టర్లు గురించి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అయిపోయాయి.

(ఇదీ చదవండి: సిల్క్‌ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని)

'యాక్టర్‌గా ఇన్నేళ్లలో చేసిన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ చేస్తుంటే బోర్ కొడుతుంది. ఈ మూవీలో లిల్లీ పాత్ర వదులుకోవడం అనేది పిచ్చి పని అవుతుంద. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో అమ్మాయికి ఇంత మంచి పాత్ర దొరకదు. అందుకే వదులుకోవాలని అనుకోలేదు' అని అనుపమ చెప్పుకొచ్చింది. అయితే ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్లీ అనుపమకు ఇలాంటి ప్రశ్ననే వచ్చేసరికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 

'మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. అలానే ఇంట్లో ప్రతిరోజూ బిర్యానీ తింటారా? లేదు కదా అలానే నేను కూడా ప్రతిరోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు కూడా డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి అన్నీ కావాలి' అని 'టిల్లు స్క్వేర్' సినిమాలో తను చేసిన గ్లామర్ పాత్ర గురించి పరోక్షంగా కౌంటర్స్ ఇచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. ఆ రూమర్స్‌ గురించి నమ్మొద్దు: సింగర్‌ మంగ్లీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement