
అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో అడుగుపెట్టిన కొంతకాలానికే ఇక్కడి ప్రేక్షకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకుండా పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది అనుపమ. అందుకే ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. కానీ ఎంతకాలమని గిరి గీసుకుని బతకాలి? గ్లామర్ పాత్రలు కూడా ఓసారి చేసి చూస్తే పోలా? అనుకుంది. అలా టిల్లు స్క్వేర్‌లో భాగమైంది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ తొలిసారి బోల్డ్‌గా నటించింది. ఇంకేముంది అభిమానులు హర్టయ్యారు, తనను ట్రోల్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు.
అనుపమకు ఇలాంటి పరిస్థితా?
టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవగా, కొద్ది రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా సోమవారం నాడు టిల్లు స్క్వేర్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనుపమ స్టేజీపైకి వచ్చి మాట్లాడబోతుంటే అక్కడున్న జనాలు వద్దని గోల చేశారు. అది గమనించిన అనుపమ మాట్లాడకుండా వెళ్లిపోవాలా? అని సైగ చేసింది. అయినా సరే ఎవరూ నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించలేదు. మాట్లాడొచ్చా? వద్దా? అని అడగ్గా వద్దని చెప్పారు. దీంతో హర్టయిన అనుపమ.. సరే వెళ్లిపోతాను అనేసింది.
కనీసం ఒక్క నిమిషం
దీంతో యాంకర్ సుమ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను తిరిగి స్టేజీపైకి తీసుకొచ్చింది. ఒక రెండు నిమిషాలైనా మాట్లాడొచ్చా? అని అనుపమ రిక్వెస్ట్ చేయగా దానికీ నిరాకరించారు. కనీసం ఒక్క నిమిషం మాట్లాడతానని అభ్యర్థిస్తూ ప్రసంగం మొదలుపెట్టింది. ముందుగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన తారక్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. నాకేం బాధ లేదు.. అభిమానుల ఎమోషన్స్ అర్థం చేసుకోగలను.. ఆ ఎగ్జయిట్‌మెంట్‌లో నేనూ అలాగే ప్రవర్తిస్తాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ముగించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా చాలామంది అక్కడి అభిమానుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. హీరోయిన్‌ను అలా కించపరచడం తప్పని కామెంట్లు చేస్తున్నారు.
🤦♂️ Our Crowd!
— Christopher Kanagaraj (@Chrissuccess) April 9, 2024
pic.twitter.com/dLF2rj2JEG
Comments
Please login to add a commentAdd a comment