‘‘చెప్పు రాధిక.. ఏం కావాల నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు చెప్పు’’ అని సిద్ధు చెప్పే డైలాగ్‌తో ‘రాధిక..’ పాట ఆరంభమవుతుంది. ‘‘రాధిక ఎవరు.. నా పేరు రాధిక కాదు.. నా పేరు లిల్లీ’’ అంటుంది అనుపమ.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘టిల్లు స్క్వేర్’లోని రెండో పాట ‘రాధిక..’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
చిత్ర సంగీతదర్శకుడు రామ్ మిరియాల ‘రాధిక..’ పాటను స్వరపరచి, పాడారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘రాధిక..’ పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment