
మలయాళ బ్యూటీ అనుపమ.. ప్రస్తుతం స్లో అయిపోయింది. తెలుగులో రెండు మూవీస్ చేస్తోంది. ఇది రాబోయే రెండు నెలల్లో థియేటర్లలోకి రానున్నాయి. ఇవి కాకుండా తమిళం, మలయాళంలో ఒక్కో చిత్రం చేస్తోంది. ఇవి తప్పితే మరో ఛాన్స్ లేదు. చెప్పాలంటే ఈమెకు అవకాశాలు రావట్లేదు. దీంతో రూట్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
మలయాళంలో 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయిన అనుపమ.. 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత చాలా చిత్రాల్లో నటించింది కానీ 'శతమానం భవతి', 'కార్తికేయ 2' మాత్రమే ఈమెకు కొద్దో గొప్పో పేరు తీసుకొచ్చాయి. దిల్‌రాజు వారసుడు ఆశిష్ హీరోగా చేసిన 'రౌడీ బాయ్స్'లో లిప్ కిస్ సీన్స్‌లోనూ నటించి అందరూ అవాక్కయ్యేలా చేసింది.
'డీజీ టిల్లు' సీక్వెల్‌లోనూ కాస్తంత బోల్డుగానే అనుమప నటించింది. కొన్నాళ్ల ముందు రిలీజైన పాట ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇదేదో ఒకటో రెండు మూవీస్ విషయంలో కాదని.. ఇకపై మరింత బోల్డ్ తరహా పాత్రలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ అయినా సరే నటించడానికి అనుపమ సిద్ధమైపోయిందట. అవకాశాలు తగ్గుతుండటం వల్లే ఇలా రూట్ మార్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్‌దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం)
Comments
Please login to add a commentAdd a comment