ఇలాంటి మసాజ్‌ కావాలంటూ ఫోటో షేర్‌ చేసిన అనుపమ | Anupama Parameswaran Shares A Photo On Instagram | Sakshi
Sakshi News home page

ఇలాంటి మసాజ్‌ కావాలంటూ ఫోటో షేర్‌ చేసిన అనుపమ పరమేశ్వరన్‌

Published Thu, Jun 6 2024 10:37 AM | Last Updated on Thu, Jun 6 2024 12:24 PM

Anupama Parameswaran Shares A Photo On Instagram

టాలీవుడ్‌లో 'టిల్లు స్వేర్‌' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. ఈ చిత్రంలో స్క్రీన్‌పై ఒక  హాట్‌గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్‌ను తెరపై చూపించింది. దీంతో గ్లామర్‌ పాత్రలకే అనుపమ పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు మించి త్వరలో లేడీ ఓరియెంటెడ్‌ సినిమా 'పరదా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ తన గ్లామర్‌ ఫోటోలతో కిక్‌ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు చికిత్స ఏదైతే బాగుండూ అంటూనే రోడ్ రోలర్‌తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల డైరెక్షన్‌లో పరదా అనే సినిమాలో అనుపమ నటిస్తుంది. ఇదొక భిన్నమైన న్యూఏజ్‌ ట్రావెల్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement