
తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మలయాళం చిత్రం ప్రేమమ్ చిత్రం ద్వారా కథానాయికలుగా పరియం అయిన ముగ్గురు భామల్లో ఈమె ఒకరు. ఆ ఒక్క చిత్రం అనుపమ పరమేశ్వరన్‌ను దక్షిణాది వ్యాప్తంగా సినిమాలు చేసింది. ఆ తరువాత కొడి చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఇక్కడా కొన్ని చిత్రాల్లోనే నటించింది.
ప్రస్తుతం జయం రవితో కలిసి సైరన్ చిత్రంలో నటిస్తోంది. ఈమె ఓ భేటీలో పేర్కొంటూ తాను మనసుకు కష్టమైన విషయాలను, బాధించే సంఘటనలను సాధ్యమైనంత త్వరగా మరిచిపోవడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. తాను చాలా పాజిటివ్ పర్సన్ అని పేర్కొంది. తనకు ఏదైనా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తానని, ఆ తరువాత దాని గురించి మరిచిపోతానని చెప్పింది.
జీవితం చాలా చిన్నదని, ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదని, వెళ్లే సమయం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని పేర్కొంది. కాబట్టి జీవితంలో ఎదురైన ఆటంకాలను, సమస్యలను మనసులోనే ఉంచుకుని మనలోని శక్తిని వృథా చేసుకోరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిఘా కెమెరాల్లోని దృశ్యాలు నెల రోజుల తరువాత ఎలాగైతే డిలైట్ అయిపోతాయో మన మనసును అలా ఉంచుకోవాలనే తత్వాన్ని అనుమప పరమేశ్వరన్ వ్యక్తం చేసింది.