డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్‌ థ్రిల్లర్..! | Jayam Ravi, Keerthy Suresh Upcoming Movie Siren Movie Direct Release Zee5 OTT Platform? - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ కానున్న కీర్తి సురేశ్‌ మూవీ..!

Published Sat, Jan 13 2024 8:01 AM | Last Updated on Sat, Jan 13 2024 8:55 AM

Star Hero Movie Direct Release In OTT Goes Viral In Social Media - Sakshi

కోలీవుడ్ స్టార్ జయంరవి, కీర్తీసురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ చిత్రంలో జయంరవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యాక్షన్‌, థ్రిల్లర్‌, కుటుంబ కథా చిత్రంగా ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో హోమ్‌ ఫిలిం మేకర్స్‌ పతాకంపై సుజాత నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌ ఇటీవల విడుదల కాగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్‌గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్‌ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్‌ ఆయన ప్రేయసిగా నటిస్తున్నారు.

(ఇది చదవండి: నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!) 

అయితే థియేటర్లలో రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సైరెన్‌ త్వరలోనే తెరపైకి రానుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జయంరవి అభిమానులకు షాకి ఇచ్చే విధంగా ఓ న్యూస్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.

గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement