
దక్షిణాది సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయమైన కేరళ బ్యూటీ అందులో పాఠశాల విద్యార్థినిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
28వ బర్త్‌డే
ఈ మూడు భాషల్లోనూ నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ సాధ్యమైనంత వరకు గ్లామర్‌కు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈమె తమిళంలో జయం రవి సరసన నటించిన సైరన్ చిత్రం గత వారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఇటీవలే ఈ భామ తన 28వ పుట్టినరోజు జరుపుకుంది. మొరిషియల్ దీవిలో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కలల జీవితానికి 10 ఏళ్లు పూర్తి
అందులో తన కలల జీవితానికి దశాబ్దం ముగిసిందని పేర్కొంది. నటిగా తన ప్రతి అడుగులోనూ మీరు (ప్రేక్షకులు) వెన్నంటి ఉండి ఉత్సాహపరుస్తున్నారంది. 18 ఏళ్ల ప్రాయంలోనే నటిగా పరిచయం అయ్యానని చెప్పింది. మీ ప్రేమ, అభిమానాలు తనను ఒక శక్తిగా మారుస్తున్నాయంది. అందమైన జీవితాన్ని గడపడానికి, ధైర్యంగా కలలు కనడానికి, తానేమిటో తెలుసుకోవడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు తెలిపింది.
చదవండి: ప్రేమ పేరుతో సోదరుడు మోసం.. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్
Comments
Please login to add a commentAdd a comment