
నటి అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్ అయ్యిందా? ఆమె అభిమానులను ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనుమానం ఇదే. అందుకు కారణం లేకపోలేదు. 2015లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్ర విజయం ఈమె దశను మార్చేసింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనుపమ పరమేశ్వరన్ బాగా ఓన్ చేసుకున్నారని చెప్పక తప్పదు. అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు భాషను కూడా నేర్చుకుంది. అదే విధంగా తమిళంలోనూ ధనుష్ జంటగా కోడి, అధర్వ సరసన తల్లి పోగాదే వంటి చిత్రాల్లో నటించింది.
ఇక మాతృభాషలో నటిస్తున్న ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల నటుడు నిఖిల్ సిద్ధార్థ్‌తో జత కట్టిన కార్తికేయ–2 తెలుగుతో పాటు హిందీలోనూ సంచలన విజయం సాధించింది. అలా బాలీవుడ్ ప్రేక్షకులను పరిచయం అయిన అనుపమ ప్రేమ వ్యవహారంపై కూడా 10 రకాల వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ బుమ్రాతో ప్రేమాయణం అంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది.
తాజాగా నటి అనుమప పరమేశ్వరన్ ఒక ప్లాస్టిక్ పేపర్‌ను ఉంగరంగా తయారు చేసి తన వేలికి తొడుక్కుని తన ఎంగేజ్‌మెంట్ ఉంగరం అంటూ ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పేర్కొంది. దీంతో తమ అభిమాన నటి పెళ్లికి సిద్ధమైందా అంటూ అభిమానులు తెగ కలవరపడిపోతున్నారు. అయితే ఆమె సరదాగా అలా చేసినట్లు పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం పెళ్లి తలపుల్లో అనుపమ. ఆ రహస్య ప్రేమికుడు ఎవరో? అంటూ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ 27 ఏళ్ల పరువాల సుందరి ప్రస్తుతం తమిళంలో నటుడు జయం రవి, కీర్తిసురేష్‌లతో కలిసి సైరన్ చిత్రంలో నటిస్తోంది.