మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ బంపరాఫర్ ఇచ్చింది. తనకు ఒకదాన్ని బహుమతిగా ఇస్తే మీ సొంతం అయిపోతానని చెప్పేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే అనుపమ లాంటి అమ్మాయి ఆఫర్ ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. కచ్చితంగా ఆ గిఫ్ట్ కొనిచ్చేస్తారుగా. ఇంతకీ అనుపమ ఏం చెప్పింది? అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే)
మలయాళ 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అనుపమ.. 'అఆ' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే', 'కార్తికేయ 2' తదితర చిత్రాలు చేసింది. రీసెంట్‌గా రవితేజ 'ఈగల్'లో కీలక పాత్రలో కనిపించింది. ఈమె సూపర్ హాట్‌గా నటించిన 'టిల్లూ స్క్వేర్' త్వరలో థియేటర్లలోకి రానుంది.
సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటే అనుపమ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఓ ఖడ్గమృగం పిల్లకి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి, దీన్ని ఎవరైనా తనకు బహుమతిగా ఇస్తే తను వాళ్ల సొంతమైపోతానని చెప్పింది. అంటే డేటింగ్ లేదా పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా చెప్పింది. ఇప్పుడీ క్యాప్షన్‌పై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. మరి గిఫ్ట్ ఇచ్చే ఆలోచన మీకేమైనా ఉందా?
(ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు)
Comments
Please login to add a commentAdd a comment