
అనుపమా పరమేశ్వరన్
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), కౌశిక్ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
అనుపమ మెయిన్ లీడ్ రోల్‌లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని కోలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘ఈగల్’, ‘టిల్లు స్వే్కర్’, ‘సైరన్’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.