'18 పేజెస్' అప్‌డేట్.. 'నీ వల్ల ఓ పిల్ల' అంటున్నా నిఖిల్ | A Lyrical Video Song Released From Nikhil Siddhartha Movie 18 Pages | Sakshi
Sakshi News home page

18 Pages Movie: 'నీ వల్ల ఓ పిల్ల' అంటున్నా నిఖిల్.. మరో సాంగ్ రిలీజ్

Published Fri, Dec 16 2022 8:04 PM | Last Updated on Fri, Dec 16 2022 8:05 PM

A Lyrical Video Song Released From Nikhil Siddhartha Movie 18 Pages  - Sakshi

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్‌'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్‌ డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వల్ల ఓ పిల్ల' అనే సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాట ద్వారా కొత్త రచయిత తిరుపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జీఏ పిక్చర్స్.

ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, పోస్టర్స్‌ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. యూత్‌లో బాగా బజ్‌ క్రియేట్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఇవాళ ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement