18Pages: సెలిబ్రిటిస్‌తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ | 18Pages Team Success party Celebrations With Tollywood Stars | Sakshi
Sakshi News home page

18Pages: సెలిబ్రిటిస్‌తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

Published Sun, Dec 25 2022 1:28 PM | Last Updated on Sun, Dec 25 2022 1:28 PM

 18Pages Team Success party Celebrations With Tollywood Stars - Sakshi

నిఖిల్ సిద్దార్థ్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘18పేజిస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  సినిమాలో అనుపమ చేసిన నందిని పాత్రకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.  క్లైమాక్స్,అలానే కొన్ని కొత్త ఫీల్ ను తీసుకొచ్చే సీన్స్ ,గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని పెంచాయి.

‘18 పేజెస్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ స‍్పందన రావడంతో  చిత్రబృందం ఫుల్ జోష్ లో ఉంది.  శనివారం రాత్రి ఈ చిత్ర యూనిట్ టాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో మెగా నిర్మాత అల్లు అరవింద్, పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్, చందు మొండేటి, బుచ్చిబాబు,  వశిష్ట, ప్రియాంక జవాల్కర్, ప్రియా వడ్లమాని తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement