Nikhil-Anupama '18 Pages' Movie Collected Rs 25 Crore Gross Globally - Sakshi
Sakshi News home page

18 Pages Box Office Collections: రూ. 25 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్, అనుపమ ‘18 పేజెస్’ చిత్రం

Published Mon, Jan 2 2023 2:28 PM | Last Updated on Mon, Jan 2 2023 3:43 PM

Nikhil Siddharth 18 Pages Earned Rs 25 Crore Gross Collections - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్‌. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీని చూసేందుకు మళ్లీ మళ్లీ థియేటర్‌కు వస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.  20 కోట్ల గ్రాస్‌ సాధించింది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా మలిచారు. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 

చదవండి: 
నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌
వాల్తేరు వీరయ్య టైటిల్‌ సాంగ్‌ లిరిక్స్‌ వివాదం.. యండమూరికి చంద్రబోస్‌ గట్టి కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement