Nikhil Siddartha Latest Movie 18 Pages First Lyrical Song Out - Sakshi
Sakshi News home page

18 Pages Movie:'పిల్ల కొంచెం టైం ఇవ్వు'.. ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్

Published Mon, Dec 5 2022 6:59 PM | Last Updated on Mon, Dec 5 2022 8:36 PM

Nikhil Siddartha Latest Movie 18 Pages Lyrical Song out now - Sakshi

నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం  '18 పేజీస్'. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి  "టైం ఇవ్వు పిల్ల" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించారు. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు" అనే పాటను శింబు ఆలపించారు. 

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్దార్థ్. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలై టీజర్, 'నన్నయ్య రాసిన' అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్ట్‌మస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement