నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ '18 పేజీస్'.. క్రేజీ ‍అప్‌డేట్ | A Song Release from Nikhil Siddharth 18 Pages Movie on December 11th | Sakshi
Sakshi News home page

18 Pages Movie: నిఖిల్ మూవీ క్రేజీ అప్‌డేట్.. ఆ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Published Fri, Dec 9 2022 6:44 PM | Last Updated on Fri, Dec 9 2022 7:03 PM

A Song Release from Nikhil Siddharth 18 Pages Movie on December 11th - Sakshi

నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు.  సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను డిసెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారికి ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. 

ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌తో పాటు 'నన్నయ్య రాసిన', 'కొంచెం టైం ఇవ్వు పిల్ల' అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం సిధ్ శ్రీరామ్ పాడిన పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇదివరకే రిలీజైన రెండుపాటలకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. కార్తికేయ మూవీతో భారీ హిట్‌ అందుకున్న నిఖిల్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement