Young Hero Nikhil 18 Pages Movie Running Successfully In Theatres - Sakshi
Sakshi News home page

18 Pages Movie: కార్తికేయ తర్వాత మరో హిట్.. కలెక్షన్లతో దూసుకెళ్తున్న '18 పేజెస్'

Published Tue, Dec 27 2022 6:20 PM | Last Updated on Tue, Dec 27 2022 7:05 PM

Young Hero Nikhil Movie 18 Pages Running Successfully In Theatres - Sakshi

ఈ ఏడాది యంగ్‌ హీరో నిఖిల్‌ నటించిన చిత్రం కార్తికేయ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి "18 పేజెస్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ రొమాంటిక్ మూవీలో నిఖిల్‌ జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. 

(ఇది చదవండి: 18Pages: సెలిబ్రిటిస్‌తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్)

రిలీజైన తొలి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. రిలీజైన తర్వాత మూడో రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో మరింత విజయవంతంగా ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే  ప్రపంచవ్యాప్తంగా రూ.13.5 కోట్ల గ్రాస్, రూ.22 కోట్ల నాన్-థియేట్రికల్ వసూళ్లను సాధించింది.  

ఈ సినిమాకు పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కథను అందించగా..  ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. గోపి సుందర్ సంగీతమందించారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement