18 Pages Movie: 'Nannaya Raasina' will be out on Nov 22nd - Sakshi
Sakshi News home page

18 Pages Movie : '18 పేజెస్‌' నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ విడుదల

Published Fri, Nov 18 2022 3:41 PM | Last Updated on Fri, Nov 18 2022 4:10 PM

Nannaya Raasina From 18 Pages Will Be Out On NOV 22nd - Sakshi

నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం​ 18 పేజెస్‌. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక కార్తికేయ-2 హిట్‌ తర్వాత నిఖిల్‌, అనుపమ కలిసి నటించిన సినిమా కావడంతో మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయన గతంలోనూ కుమారి 21 ఎఫ్‌ చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం డిసెంబర్‌23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ‍క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి నన్నయ్య రాసిన అనే లిరికల్‌ వీడియోను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.  గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement