ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..! | This Week OTT and Theatres Release Movies | Sakshi
Sakshi News home page

OTT and Theatres Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..!

Published Mon, Dec 19 2022 6:23 PM | Last Updated on Mon, Dec 19 2022 6:30 PM

This Week OTT and Theatres Release Movies - Sakshi

క్రిస్‌మస్‌‌ సందర్భంగా ఈవారం థియేటర్లకు కొత్త సినిమాలు క్యూ కట్టాయి. సినీ ప్రేక్షకులకు విందు పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ 'అవతార్‌-2' థియేటర్లలో అలరిస్తోంది. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: రవితేజ 'ధమాకా' ట్రైలర్‌ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది)

రవితేజ  'ధమాకా': మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. 

18 పేజెస్ లవ్ స్టోరీ:  నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్‌.  ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్‌’ డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 23న ప్రేక్షకులను అలరించనుంది. 

'లాఠీ'తో వస్తున్న విశాల్: విశాల్‌ తాజా చిత్రం 'లాఠీ'. సునయన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు ముఖ్య పాత్ర పోషించారు. ఆర్‌. వినోద్‌ కుమార్‌ను దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణం, యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

నయన్‌తో కనెక్ట్:  లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన మరో లేటెస్ట్‌ హార్రర్‌ చిత్రం 'కనెక్ట్‌'. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన్‌ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది.

‘సర్కస్‌’

రణ్‌వీర్‌ సింగ్‌, పూజాహెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్.  ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌, బాద్‌షా, లీజో జార్జ్‌ సంగీతమందించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 23 విడుదల కానుంది. 

ఓటీటీకీ రెడీ అయిన చిత్రాలు

 ♦ ఆహా

►'మసూద'- డిసెంబర్ 21

 ♦ నెట్‌ఫ్లిక్స్

► జయ జయ జయ జయహే-డిసెంబర్ 22

 ♦ వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్‌

  • ఎమిలి ఇన్‌ పారిస్‌ - డిసెంబరు 21
  • ఎలైస్‌ ఇన్‌ బోర్డర్‌ ల్యాండ్‌ - డిసెంబరు 22
  • గ్లాస్‌ ఆనియన్‌: నైవ్స్‌ అవుట్‌ మిస్టరీ - డిసెంబరు 23
  • ద ఫాబ్యూలస్‌ - డిసెంబరు 23
  • ద టీచర్‌ - డిసెంబరు 23

అమెజాన్‌ ప్రైమ్‌

  • టామ్‌ క్లాన్సీస్‌ జాక్‌ ర్యాన్‌- డిసెంబరు 21

జీ5

  • షడ్యంత్ర -డిసెంబరు 18
  •  పిచర్స్‌ -డిసెంబరు 23

డిస్నీ+హాట్‌స్టార్‌

  • బిగ్‌బెట్‌ - డిసెంబరు 21

సోనీ లివ్‌

  • కాఠ్‌మాండు కనెక్షన్ - డిసెంబరు 23
  • తారా వర్సెస్‌ బిలాల్‌- డిసెంబరు 23

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement