
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యమలో ఈ సినిమాలోని ‘ఏడురంగుల వాన..’ పాటను చిత్రం బృందం ఆదివారం విడుదల చేసింది. శ్రీమణి రాసిన సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ పాటను రిలీజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘అనుపమ గురించి మాట్లాడకుండ ఉండలేను. ఆమెను చూస్తే నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి తను. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్‌పరేంట్‌గా ఉంటుంది. మనసులో ఏది ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే అనుమప అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. హీరో నిఖిల్ గురించి మాట్లాడుతూ.. నిఖిల్ చాలా అంకిత భావంతో పనిచేస్తాడంటూ ప్రశంసించారు.
చదవండి:
అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment