డబ్బింగ్‌ మొదలుపెట్టిన రజనీకాంత్‌ | Rajinikanth Start Annaatthe Movie Dubbing | Sakshi
Sakshi News home page

Rajinikanth: డబ్బింగ్‌ చెప్పుకుంటున్న పెద్దన్న!

Published Fri, Jul 30 2021 7:33 AM | Last Updated on Fri, Jul 30 2021 7:33 AM

Rajinikanth Start Annaatthe Movie Dubbing - Sakshi

Rajinikanth Annaatthe Dubbing: అన్నయ్య చెబుతున్నారు.. ఏం చెబుతున్నారు? ఎవరికి చెబుతున్నారు? అంటే.. ఎవరికీ ఏమీ చెప్పడంలేదు. తన పాత్రకు తాను డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. రజనీకాంత్‌ నటిస్తున్న ‘అన్నాత్తే’ (పెద్దన్నయ్య) చిత్రం తాజా అప్‌డేట్‌ ఇది. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రజనీకాంత్‌ తాజాగా డబ్బింగ్‌ కూడా ఆరంభించారు. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసిందని సమాచారం.

హైదరాబాద్, కోల్‌కత్తాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా, కోవిడ్‌ నేపథ్యంలో వాటిని చెన్నైలోనే ముగించారట. దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు డబ్బింగ్‌ పనులు ఆరంభమయ్యాయి కాబట్టి ‘అన్నాత్తే’ చెప్పిన టైమ్‌కే వచ్చేస్తాడని ఫ్యాన్స్‌ ఆనందపడుతున్నారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement