
సింగర్‌గా జాక్వెలిన్...!
ఒకప్పుడు నటీనటులు సినిమాలో తమపై వచ్చే పాటలను తామే పాడుకునేవారు. ఆ తర్వాత సీన్ మారింది. పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే స్థితిలో కూడా ఇప్పుడు కొంతమంది తారలు లేరు. దానికి కారణం పరభాషా చిత్రాల్లో ఎక్కువగా చేయడమే. డబ్బింగ్ సంగతెలా ఉన్నా కొంతమంది తారలు అడపా దడపా పాటలు పాడుతున్నారు. శ్రుతీహాసన్, నిత్యామీనన్ వంటి తారలు సింగర్స్‌గా కూడా ప్రతిభ నిరూపించుకున్నారు.
హిందీలో ఆ మధ్య ఆలియా భట్ సింగర్ అవతారమెత్తారు. ఈ జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరనున్నారు. హీరో సూరజ్ పంచోలితో కలిసి ఆమె ఓ ఆల్బమ్‌లో నటించారు. ఈ ఆల్బమ్ కోసం గాయకుడు గుర్వీందర్ సీగల్‌తో కలిసి జాక్వెలిన్ ఓ పాట పాడనున్నారు.