
.. అంటే సూర్య తెలుగు మాట్లాడారని అర్థం. తెలుగు వేడుకల్లో సూర్య తెలుగు మాట్లాడటం విన్నాం. ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏముంది అనుకుంటున్నారా? సినిమాలో సొంత గొంతు వినిపించబోతున్నారు. తమిళంలో సూర్య చేసిన సినిమాలు తెలుగులో విడుదలవు తుంటాయి. కానీ, ఆయన పాత్రకు వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పేవారు. ఈసారి సూర్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలను కున్నారు. అంతే.. తెలుగు పేసిట్టారు (మాట్లాడేశారు). ఆయన తెలుగు పలుకులను మనం వినబోతున్నది ‘గ్యాంగ్’ సినిమాలో.
తమిళంలో సూర్య హీరోగా రూపొందిన ‘తానా సేంద కూట్టమ్’ను యూవీ క్రియేషన్స్ తెలుగులో ‘గ్యాంగ్’గా ఈ సంక్రాంతికి విడుదల చేయనుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు మాట్లాదుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్యగారు తొలిసారి తెలుగు డబ్బింగ్ చెప్పటం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. జనవరి 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్.
Comments
Please login to add a commentAdd a comment