
తెలుగు నేర్పించింది..
నేను పుట్టింది ముంబయిలో అయినా నా సొంతూరు హైదరాబాద్ అనే ఫీలవుతా. ఇక్కడికి వస్తే ఏదో వేరే ప్రాంతానికి వ చ్చినట్టుండదు. అంతలా నా మనసుకు దగ్గరైపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు పాజిటివ్స్ వైబ్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లోనే నేను తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. త్వరలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. నేనంత ఫుడీని కాకపోయినా ఇక్కడి కొస్తే బిర్యానీ, చేపల పులుసు మిస్ కాను. ఆ డిషెస్ గురించి తలుచుకుంటేనే నోరూరిపోతుంది.
విశేషం ఏంటంటే.. హైదరాబాద్ బిర్యాని టేస్ట్ ఒక్కో రెస్టారెంట్‌లో ఒక్కో విధంగా ఉంటుంది. ఒకదానికి మించి ఒకటి అన్నీ బాగుంటాయి. ఇక్కడ షికారంటే మాలాంటి వాళ్లకు కాస్త కష్టమే కదా. అయినా వచ్చినప్పుడల్లా జీవీకే మాల్‌ను చుట్టేయాల్సిందే. షూటింగ్ నిమిత్తం మేం రకరకాల ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాం. కానీ నేను చూసిన అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సూపర్‌బ. - తమన్నా