మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రజిని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కల్యాణ్ దేవ్ గురువారం డబ్బింగ్ ప్రారంభించారు. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘బాహుబలి’ కెమెరామ్యాన్ సెంథిల్ కుమార్ మా చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ మా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి సంగీతం సమకూర్చారు. త్వరలో టైటిల్, రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాని.
Comments
Please login to add a commentAdd a comment