
రాశీఖన్నా
‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం తొలిసారి గొంతు సవరించారు కథానాయిక రాశీఖన్నా. తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తన మాటలు వినమంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇజాబెల్లా లెయితే కథానాయికలుగా నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ వల్లభ నిర్మించారు.
ఈ సినిమా కోసమే తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నారు రాశీఖన్నా. ‘‘నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలంటే నా గొంతు సరిగ్గా లేదేమోనని, పద ఉచ్చారణ లయ తప్పుతుందేమోనని కాస్త భయం ఉండేది. కానీ ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్నాను. బాగా వస్తోంది. నేనే ఆశ్చర్యపోతున్నా. ప్రేక్షకులకు నా గొంతు వినిపించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా.
Comments
Please login to add a commentAdd a comment