
సాక్షి, హైదరాబాద్: ఆర్‌ఎక్స్ 100తో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తన అందాల ఆరబోతతో యువకులను కట్టిపడేస్తుంటుంది. వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టింది ఈ భామ. ఇప్పుడు తాజాగా తన కలనెరవేరింది అని మురిసిపోతుంది ఈ భామ.
తెలుగులో డబ్బింగ్ చెప్పడం తన కల అని, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఒక సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పనంటూ సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు షేర్ చేసింది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్‌లో పాయల్ ‘నరేంద్ర’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతుంది. ఈ సినిమాలో పాయల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.
My first dub in telugu 🎬 pic.twitter.com/zuYFfEVBel
— paayal rajput (@starlingpayal) September 11, 2020
చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్‌పప్రీత్, సారా అలీఖాన్ పేర్లు?