మాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి మంజువారియర్. ఈమె తమిళంలో అజిత్ సరసన నటిస్తున్న చిత్రం తుణివు. హెచ్ వినోద్ కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని జీసినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పొంగల్ సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్‌కు సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు విడుదలై అజిత్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. అందులో ఒకటి కాసేదాన్ కడవులడా పల్లవితో సాగే పాట. ఈ పాటను సంగీత దర్శకుడు జిబ్రాన్‌తో కలిసి నటి మంజు వారియర్ పాడటం విశేషం. అయితే ఇటీవల విడుదలైన ఈ పాటలో నటి మంజువారియర్ సెట్ కాలేదని కోరస్‌లో కలిసిపోయిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
వాటిపై స్పందించిన ఆమె తుణివు చిత్రంలో తాను పాడిన పాటలో తన గొంతు బాగోలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. తన పాటపై వారు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని, తన గొంతు బాగోలేదని మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని, తాను వీడియో వెర్షన్ కోసమే పాడినట్లు పేర్కొన్నారు. ట్రోలింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు మంజువారియర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment