
జగపతి బాబు, పి.రవిశంకర్
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘లయన్ కింగ్’ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జూలై 19న విడుదల కానుంది. జాన్ ఫేవ్‌రేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్కార్ పాత్రకి నటుడు జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా, ముఫార్ పాత్రకి డబ్బింగ్ స్టార్, నటుడు పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment