animated film
-
OTT: యానిమేటడ్ ఫాంటసీ మూవీ ‘విష్’ రివ్యూ
మనకందరికీ విషెస్ ఉంటాయి. మన విష్ తీరాలని మనం ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాం. ఒకవేళ మన విష్ తీర్చే విజార్డ్ మనకు దొరికితే సూపర్ గా వుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ఈ విష్. వాల్ట్ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన ఈ యానిమేటడ్ ఫాంటసీ మూవీ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో స్ట్రీం అవుతోంది. క్రిస్బక్, ఫాం అనే ఇద్దరు డైరెక్టర్స్ ఈ మూవీని కలిసి తీశారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెడిటేరియన్ సీ లోని ఓ ఐలాండ్ లో కింగ్ డమ్ ఆఫ్ రోజాస్ అనే రాజ్యం వుంటుంది. ఆ రాజ్యానికి రాజు మాగ్నిఫికో, రాణి అమాయ. మాగ్నిఫికో రాజు తన మంత్రశక్తితో నెలకోసారి తన ప్రజలకు సంబంధించి ఒక్క విష్ ను తీరుస్తూవుంటాడు. అది కూడా ఓ పెద్ద ఉత్సవం లా చేసి ఎవరికైతే విష్ కావాలో వాళ్ళని మాగ్నిఫికో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటాడో వారి విష్ ను మాత్రం తీరుస్తాడు. అలాంటి టైంలో ఈ సినిమా హీరోయిన్ ఆషా తన తాత సబినో100th బర్త్ డే కి తాత విష్ కింగ్ గ్రాంట్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతుంది. అయితే రాజు మాగ్నిఫికోకి తన తాత విష్ ను గ్రాంట్ చేయమని కోరుతుంది. దానికి మాగ్నిఫికో ఒప్పుకోడు. ఆషా ఈ విషయంలో బాగా బాధ పడి ఆకాశం లో వున్న స్టార్ ను తన విష్ ను గ్రాంట్ చేయమని ప్రే చేస్తుంది. అనుకోకుండా ఆషా కోసం స్టార్ ఒక బాల్ రూపంలో వచ్చి మాజిక్ చూపిస్తుంది. ఇంక మిగతా స్టోరీ అంతా స్టార్ మాజిక్ తో కింగ్ మాగ్నిఫికో ని ఆషా ఎలా ఎదుర్కుంటుందనేదే ఈ విష్ మూవీ. స్టన్నింగ్ మాజిక్ ఎఫెక్ట్స్ తో సూపర్ గ్రాండ్ విజువల్స్ తో విష్ మూవీ మీకు ఈ వీక్ సూపర్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచిట్. - ఇంటూరు హరికృష్ణ -
OTT: ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’ మూవీ రివ్యూ
అద్భుతమైన ఒక ఫాంటసీ సినిమా చూస్తారా? దాని పేరు ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’. యానిమేటెడ్ ఫిల్మ్. ఈ కథ పీటర్ అనే ఓ అనాథది. పీటర్ చిన్నప్పుడే తన ఫ్యామిలీతో పాటు తను ఎంతగానో ఇష్టపడే చెల్లెలిని కోల్పోతాడు. అప్పటి నుండి పీటర్‌ను ఓ మాజీ సైనికుడు పెంచుతూ ఉంటాడు. అనకోకుండా పీటర్ ఓ మహిళా మెజీషియన్‌ను కలుస్తాడు. ఆ మెజీషియన్ పీటర్ చెల్లెలు బతికే వుందని, కాకపోతే ఓ ఎలిఫెంట్ ద్వారా పీటర్‌కు ఆ చెల్లెలు దొరుకుతుందని చెబుతుంది.పీటర్ ఉండేది బాల్టీసి రాజ్యంలో. ఆ రాజ్యంలో ఇప్పటి దాకా తను ఏ ఎలిఫెంట్‌ను చూడలేదు, ఇప్పుడెలాగబ్బా అని అనుకుంటుంటే మేజిక్ షోలో పీటర్‌కు ఓ ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఆ ఎలిఫెంట్‌ను తనతో తీసుకువెళదామనుకుంటే ఆ దేశపు తిక్కరాజు పీటర్‌కు మూడు కఠినమైన టాస్కులు పెడతాడు. వాటిలో పీటర్ నెగ్గితే ఎలిఫెంట్‌ను తీసుకువెళ్ళవచ్చని కండిషన్ పెడతాడు. రాజు పెట్టిన ఆ మూడు కండిషన్లు ఏమిటి, పీటర్ ఎలిఫెంట్‌ను గెలుచుకుంటాడా లేదా, పీటర్ చివరికి తన చెల్లెలిని కలుసుకుంటాడా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఉన్న ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’ను చూడాల్సిందే. వెండీ రాజర్స్ అనే దర్శకుడు తీసిన ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ముఖ్యంగా రాజు ఇచ్చిన టాస్కులు కాని, ఎలిఫెంట్ చేసే ఫీట్లుగాని సూపర్‌గా వుంటాయి. సో దిస్ వీకెండ్ పిల్లలకు, పెద్దలకు కాదు కాదు మొత్తం ఫ్యామిలీకి సూపర్ ఛాయిస్ ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’.– ఇంటూరు హరికృష్ణ -
జగపతిబాబు@ స్కార్ రవిశంకర్@ ముఫార్
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘లయన్ కింగ్’ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జూలై 19న విడుదల కానుంది. జాన్ ఫేవ్రేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్కార్ పాత్రకి నటుడు జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా, ముఫార్ పాత్రకి డబ్బింగ్ స్టార్, నటుడు పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
సింహానికి మాటిచ్చారు
క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతాయి.. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి జీవిస్తాయి. జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అవునా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా డిస్నీ వాళ్లు తయారు చేసిన ‘లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. ఇదే ఈ సినిమా కథకి హీరో. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. జూలై 19న విడుదల కానున్న ఈ సినిమాకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గాత్ర దానం చేశాడు. ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పగా, ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్టూన్ ¯ð ట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ ని డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ‘లయన్ కింగ్’ ఫ్యాన్స్‌కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. -
నంబర్ పాత్రలతో యానిమేషన్ చిత్రం
ప్రయోగాత్మక, చిత్రాలకిప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ తమిళ సినిమా, మరో అంతస్తుకు చేరుకుంటోంది. ఇటీవల తెరపైకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్లో రూపొంది అశేష అభిమానుల్ని అలరిస్తోంది. తాజాగా 029 అనే మరో యానిమేషన్ చిత్రం తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది జీరో నుంచి తొమ్మిది అంకెల పేరుతో పాత్రలు తెరకెక్కించిన వినూత్న ప్రయోగాత్మక యానిమేషన్ చిత్రం. టీఎఫ్ఎస్ఎస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహిళా దర్శక నిర్మాత బి.నిషా తెరపై ఆవిష్కరించిన చిత్రం 029. ఇలా సంఖ్య పేర్లతో పాత్రల రూపకల్పన చేసి చిత్రం చేయడం అనేది ప్రపంచంలోనే తొలి ప్రయత్నం అవుతుంది. ఈ కథ ప్రేమ, రొమాన్స్, హాస్యం, యాక్షన్ అంటూ జనరంజక అంశాలన్నీ చోటు చేసుకుంటాయంటున్నారు. దర్శక నిర్మాత బి.నిషా. ఈమె చిత్రం గురించి మాట్లాడుతూ, 100 నుంచి 150 మంది సాంకేతిక నిపుణులు ఆరేడేళ్లు, రేయింబవ ళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం 029 అని తెలిపారు. తమిళ సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేశామన్నారు. ఫలితం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించామన్నారు. పెద్దలు మెచ్చే విధంగా 029 యానిమేషన్ చిత్రం ఉంటుందన్నారు. 3డి యానిమేషన్లో రూపొందిన కోచ్చడయాన్ చిత్రం విశేష ప్రజాదరణ పొందుతోందన్నారు. ఆ చిత్ర మైలేజ్ తమ చిత్రానికి ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాత బి.నిషా వ్యక్తం చేశారు. విజయ్ రమేష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మిరకిల్ పీటర్ యానిమేషన్‌ను రూపొందించారు. చిత్రాన్ని మిస్బా యాడ్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది.