30 ACT
-
తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు
తిరుపతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌజ్ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతలనూ వేధింపులకు గురి చేస్తోంది.శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ఆరోపణలు.. తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ పాపానికి పరిహారంగా ప్రక్షాళన పూజలు చేయాలని వైఎస్సార్సీపీకి కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంతోనే ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే..జగన్ ఇవాళ సాయంత్రమే తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం తాడేపల్లికి తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటన కావడం.. పైగా ఈ పర్యటనను ప్రత్యర్థి పార్టీలు రాద్ధాంతం చేసే అవకాశం ఉండడంతో ఎటువంటి హడావిడి చేయొద్దని, ప్రత్యర్థులు కవ్వింపులకు పాల్పడ్డా సంయమనం పాటించాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే ఆయన సూచించారు. అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అతి చేష్టలకు దిగింది. ఇదీ చదవండి: వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోలమునుపెన్నడూ లేని విధంగా తిరుపతి తిరుమలలో పోలీసు మోహరింపు కనిపిస్తోంది. సుమారు వెయ్యి మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. ఉన్నపళంగా పోలీస్ యాక్ట్ 30ను తెరపైకి తెచ్చారు. ఈ వంకతో గత రాత్రి నుంచి వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా పోలీసు 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని పోలీసులు అంటున్నారు. అక్టోబర్ 24వ తేదీ దాకా.. సభలు, సమావేశాలు, ర్యాలీలకు, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయాని హెచ్చరికలు జారీ చేశారు. అయితే జగన్ తిరుమల దర్శన కార్యక్రమానికి అనుమతుల్లేవంటూ పోలీసులు ఆ నోటీసుల్లో ప్రస్తావించడం గమనార్హం!.ఇక వైఎస్ జగన్ ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనకు ఆహ్వానం పలికేందుకు వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అదే టైంలో అదే సోషల్ మీడియాలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తాము సెక్షన్ 30 అమలు చేస్తున్నామంటున్నారు. దీంతో.. ఎయిర్పోర్ట్ నుంచే జగన్ పర్యటనకు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వెంట నేతలెవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవచ్చని సమాచారం. మరోవైపు.. చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రావొచ్చనే సమాచారంతోనే తాము తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఈ హడావిడితో సాధారణ ప్రజలు, భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులతో పాటు భయాందోళనకు గురవుతున్నారు. ఆధ్యాత్మిక సందర్శనకు రాజకీయ రంగు పులుముతున్నారని.. గతంలో ఎన్నడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన ఘటనలు లేవని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు.నేతల గృహనిర్భంధాలుజగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో.. చుట్టుపక్కల జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు. మరోవైపు.. తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ నేతల గృహ నిర్భంధం కొనసాగుతోంది. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని వేకువ ఝామునే చుట్టుముట్టిన పోలీసులు.. జగన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆకేపాటి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘30 రోజుల ప్రణాళికతో ప్రగతి బాగుంది’
సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలో 30 రోజులు ప్రణాళికను సమగ్రంగా అమలుచేసి గ్రామాల్లో సాధించిన ప్రగతి బాగుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. కేవలం 30 రోజుల్లో కలనా? నిజమా? అనేలా గ్రామాల్లో ప్రగతి విప్లవంలా జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఘనత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావుకే దక్కిందని అన్నారు. తెలంగాణలోని 24 గంటలు విద్యుత్, రైతు బంధు పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి ఆయా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పటివరకూ సంగారెడ్డి జిల్లాలో 70 ఏళ్లుగా జరగని అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో చేసి చూపెట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉన్న కారణంగానే హుజూర్నగర్ ఉప ఎన్నిక గెలిచామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని మంత్రి హరీశ్ రావు అన్నారు. -
సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు
సాక్షి, పరకాల: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి వ్యక్తులు ఉన్నా లేకున్నా సరైన సిస్టం (వ్యవస్థ)ఉండాలని అప్పుడే సమస్యలు దూరమవుతాయని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కమిటీల ద్వారా నిరంతరం సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం సందర్శించి సర్పంచ్ అల్లం బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు, పలు కమిటీల సభ్యులతో ఆమె గ్రామంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మోరీలు శుభ్రంచేశారా.. లైట్లు వెలుగుతున్నాయా.. ఇంకా ఇతర పనులు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పనులు చేపట్టడానికి కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్ బాలిరెడ్డితో పాటు స్థానికుల కృషితో గ్రామం చాలా నీట్‌గా పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. పండుగ వాతావరణం నెలకొందని, రాత్రి పూట సమావేశం ఏర్పాటు చేస్తే చీకటిలో కూర్చున్నా ఒక్క దోమ కూడా ఎవరినీ కుట్టకపోవడం విశేషం అని అభినందించారు. దీంతో గ్రామం ఎంత శుభ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. సీఎం కేసీఆర్‌ను గ్రామానికి తీసుకుని వస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని, ఎలాగైనా వచ్చేలా చూడాలని సర్పంచ్ బాలిరెడ్డి కోరగా గ్రామం సాధించిన ప్రగతి గురించి సీఎంకు వివరిస్తానని ఆమె తెలిపారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, బడ్జెట్ గురించి సర్పంచ్ బాలిరెడ్డితో పాటు కమిటీల సభ్యులు తిరుమల్‌రెడ్డి దిలీప్‌రెడ్డి, ఆడెపు రాంనాధం, అల్లం చిన్నపురెడ్డి, బిట్ల నాగరాజు, పులిశేరి మంజుల, అద్దాల లలిత, శేషు ఆమెకు తెలిపారు. సర్పంచ్ కృషి, పట్టుదల, అంకితభావంతోనే గ్రామం ప్రగతి వైపు పరుగులు తీస్తోందని గ్రామస్తులు స్మితా సబర్వాల్‌కు వివరించారు. వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ముండ్రాతి హరిత, ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అనితా రాంచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాజేశ్‌చౌహాన్, డీపీఓ నారాయణరావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీఎల్పీవో స్వరూప, ఎంపీపీ బీమగాని సౌజన్య, జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ శేషాంజన్‌స్వామి, ఏపీఓ మోహన్‌రావు, ఏపీఎం సురేశ్‌కుమార్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, ఎంపీటీసీ వీరారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పలు కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిరంతరం ఇదేస్పూర్తిని కొనసాగించాలి ధర్మసాగర్: 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమం పనుల ద్వారా గ్రామంలో మార్పు కనిపిస్తుందని నిరంతరం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని స్మితా సబర్వాల్ అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, ఉపసర్పంచ్ బొడ్డు అరుణ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం స్మితా సబర్వాల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామపంచాయతీ వారు తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలను గ్రామస్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు సహకరిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, జెడ్పీసీఈఓ ప్రసూనరాణి, ఎంపీడీఓ జి.జవహర్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీపీ నిమ్మ కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల శ్రీలత, ఎంపీటీసీ సభ్యులు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆ మూడు ఇళ్లకు జరిమానా వేయండి: మంత్రి
సాక్షి, వనపర్తి: 30రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి జిల్లాలో రెండు గ్రామాల్లో పర్యటించారు. హెలిక్యాప్టర్‌లో జిల్లాకు చేరుకున్న మంత్రి దయాకర్‌రావు చిట్యాల గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి భోజనం చేశారు. అనంతరం చిట్యాల గ్రామంలో పర్యటించారు. లోపించిన పారిశుద్ధ్యంను చూసి అసహనం వ్యక్తంచేశారు. ఓ ఇంటి ముందు పెంటకుప్పను ఏర్పాటు చేయటం, ఓ కిరాణంషాపు ఎదురుగా స్థలంలో చెత్తాచెదారం నిండి ఉండటం చూసిన మంత్రి అధికారులపై మండిపడ్డారు. మంత్రి గ్రామానికి వస్తున్నాడని తెలిసినా ఇంత నిర్లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులకు నోటీసులు.. ఓ గృహిణితో మంత్రి మాట్లాడుతూ ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారా..? వాడుతున్నారా అని ప్రశ్నించగా.. ఆమె మరుగుదొడ్డిలేదని, బహిర్భూమికి వెళ్తామని చెప్పారు. ఒక్కసారిగా మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓడీఎఫ్ జిల్లా అంటే ఇదేనా అని డీపీఓను ప్రశ్నించారు. మరో ఇంటికి వెళ్లిన మంత్రి ఇంకుడుగుంతలను పరిశీలించారు. లేకపోవటంతో చిట్యాల గ్రామంలో ఇంటింటికీ ఇంకుడుగుంతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. డీఆర్డీఓను వెంటనే నిర్మాణం చేయిస్తామని సమాధానం ఇచ్చారు. 30 రోజుల ప్రణాళికా కార్యక్రమంలోనే పని చేయకుంటే ఎప్పుడు పని చేస్తారంటూ డీఆర్డీఓ గణేష్, డీపీఓ రాజేశ్వరిని, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను ప్రశ్నించారు. వెంటనే వీరికి నోటీసులు జారీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌కు సూచించారు. గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు రావటం లేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావటంతో తాగునీరు ఎందుకు రావటంలేదని మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్ను మంత్రి ప్రశ్నించారు. గంట నుంచి గ్రామంలో ఓ మంత్రి పర్యటిస్తుంటే రావాలని తెలియదా అంటూ ఎస్ఈని మందలించారు. ఇంటి ఆవరణ శుభ్రంగా ఉంచుకోని వారికి, పెంటకుప్ప ఏర్పాటు చేసిన వారికి జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. చిట్యాల గ్రామాన్ని అధికారులు పట్టించుకోవటం లేదా సర్పంచు ఏం చేస్తున్నారు. ఎందుకింత పూర్ ప్రోగ్రేస్ అంటూ మండిపడ్డారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు నామమాత్రంగా చేశారా అని మంత్రి ప్రశ్నించారు. కమిటీ సభ్యులలో ఒకరిని వేదికపై పిలిచి ఎందుకు గ్రామంలో నివాసగృహాల ఎదుట అపరిశుభ్రత ఉందని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏం చేద్దామని అడిగారు. జరిమానాలు వేసి కచ్చితంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య నివారణ చర్యలు, శ్రమదానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు శ్రమదానం చేస్తే వారికి రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. గ్రామంలో శ్రమదానం చేసిన వారిపేర్లను, ఆర్థిక సాయం చేసిన వారి పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేసి పేర్లు రాయాలని సూచించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. వనపర్తి మార్కెట్‌యార్డు మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల అభివృద్ధి కోసం రూ.పది లక్షల విరాళం ప్రకటించారు. రూ.5లక్షల చెక్కును మంత్రి దయాకర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్మన్లు ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, సరిత, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్ శోభ, ఏ.కె. సిన్హా, జేసీ డి.వేణుగోపాల్, డీఆర్ఓ వెంకటయ్య ఉన్నారు. -
ఎవరిదో దత్తత అదృష్టం
సాక్షి, జనగామ: ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో సమస్త గ్రామాలు..సకల జనులు ఒక ఉద్యమంలాగా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. తమ ఇంటి నుంచే కాకుండా గ్రామస్తులకు ఉపయోగపడే పనుల్లో పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు.. ప్రత్యేక అధికారులు.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామంలో ఉండే ప్రతిఒక్కరూ తమకు తాముగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి యజ్ఞంలో పా ల్గొని స్ఫూర్తి నింపారు. ఏ పల్లెకు ఆ పల్లె పనులు చేపట్టి భేష్ అనిపించుకున్నారు. కానీ జిల్లాలో దత్తత అదృష్టం ఏ గ్రామం తలుపు తట్టనుందో. ప్రభుత్వ దత్తత అవకాశం ఏ గ్రామానికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ప్రభుత్వం గ్రామాల్లో మార్పు తీసుకురావడం కోసం 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులను చేపడుతోంది. 30 రోజుల ప్రత్యేక పనులను సక్రమంగా నిర్వహించే గ్రామాలను ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. నిధులను ఇచ్చి అభివృద్ధి చేస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సెప్టెంబర్ నాలుగో తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల అవగాహన సదస్సులో స్పష్టంచేశారు. పనులు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రభుత్వ దత్తతకు ఎంపికయ్యే ఏ గ్రామ పంచాయతీ అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనిఖీ అధికారుల టీం ఇదే.. జిల్లాలో కొనసాగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పనులను పరిశీలించడానికి 12 మంది అధికారులతో కూడిన తనిఖీ టీంను నియమించారు. ఒక్కొక్క మండలానికి జిల్లా స్థాయి అధికారిని ఒక్కరి చొప్పున నియమించారు. జనగామ మండలానికి విశ్వ ప్రసాద్ (కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), బచ్చన్నపేట మండలానికి టీవీఆర్ మూర్తి (కలెక్టరేట్ సూపరింటెండెంట్), లింగాలఘనపురం మండలానికి మన్సూరీ(కలెక్టరేట్ సూపరింటెండెంట్), దేవరుప్పుల మండలానికి వీరస్వామి (కలెక్టరేట్ సూపరింటెండెంట్), తరిగొప్పుల మండలానికి రవికిరణ్ (డిప్యూటీ తహసీల్దార్), రఘునాథపల్లి మండలానికి అబ్దుల్ (డీఏఓ ఆర్డీఓ కార్యాలయం), స్టేషన్ ఘన్పూర్ మండలానికి సలీమ్ (తహసీల్దార్), చిల్పూర్ మండలానికి శంకర్ (డిప్యూటీ తహసీల్దార్), పాలకుర్తి మండలానికి వంశీ (కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్), జఫర్‌గఢ్ మండలానికి షకీర్ (ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్), కొడకండ్ల మండలానికి రాజు (ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్)లను నియమించారు. ఈ టీం అధికారులు ఇప్పటి వరకు గ్రామాల్లో జరిగిన 30 రోజుల పనుల వివరాలను సేకరిస్తారు. నేరుగా గ్రామానికి వెళ్లి గ్రామస్తులతోనే మాట్లాడి పనుల అమలుపై ఆరా తీస్తారు. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి పనుల, ఆయా పంచాయతీల్లో తయారు చేసిన నివేదికలను పరిశీలిస్తారు. మరో 4 రోజులే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమైన పనులు ఈ నెల ఆరో తేదీతో ముగియనున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, శ్రమదానాలు, కరెంటు స్తంభాల ఏర్పాటు, దోమల నివారణ చర్యలు, శిధిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత, నిరుపయోగంగా ఉన్న బావులు, బోరు బావుల పూడ్చివేత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటడంతో పాటుగా శ్రమదానాలు నిర్వహిస్తున్నారు. స్పెషలాఫీసర్లు గ్రామాల్లో పల్లె నిద్ర సైతం చేశారు. ప్రత్యేక పనులు ముగింపు దశకు చేరడంతో మిగిలిపోయిన పనులు పూర్తిస్థాయిలో చేపట్టడానికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. -
జగపతిబాబు@ స్కార్ రవిశంకర్@ ముఫార్
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘లయన్ కింగ్’ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జూలై 19న విడుదల కానుంది. జాన్ ఫేవ్రేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్కార్ పాత్రకి నటుడు జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా, ముఫార్ పాత్రకి డబ్బింగ్ స్టార్, నటుడు పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
హిందూపూర్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన