
పూజా హెగ్డే
జనరల్‌గా ఒక సినిమా షూటింగ్‌లోనే కథానాయికల డే అంతా ముగిసిపోతుంది. కానీ శనివారం పూజా హెగ్డే ఏకంగా మూడు డిఫరెంట్ సినిమాల వర్క్‌లో భాగమై మంచి వర్కింగ్ డేను ఎంజాయ్ చేశారామె. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు.
ఆ నెక్ట్స్ మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ సినిమా సెట్‌లో జాయిన్ అయ్యారు. ఫైనల్‌గా ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగమయ్యారు. ఇలా ఒకే రోజు మూడు సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగమయ్యారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment