
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినివ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా జరుగుతోంది.
తాజాగా ‘ఆది పురుష్’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ కూడా షురూ అయ్యాయి. ఈ సినివలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు కృతీ సనన్. ‘‘గెట్ సెట్ డబ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ‘ఆది పురుష్’ డబ్బింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు కృతి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment