డబ్బింగ్‌ ఆరంభం | Dubbing work for Allari Naresh Bachchala Malli begins | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ ఆరంభం

Published Mon, Jul 8 2024 3:33 AM | Last Updated on Mon, Jul 8 2024 3:33 AM

Dubbing work for Allari Naresh Bachchala Malli begins

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ డబ్బింగ్‌ పనులు ఆరంభమయ్యాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై ‘సామజవరగమన, ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ‘బచ్చల మల్లి’ సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

కాగా  తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ని ప్రారంభించారు మేకర్స్‌. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ మూవీలో గతంలో ఎన్నడూ చూడని మాస్‌ క్యారెక్టర్‌లో నరేష్‌ని చూపించనున్నారు డైరెక్టర్‌ సుబ్బు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.   ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్‌ ఎం.నాథన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement