
ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ "ఫ్లాష్ బ్యాక్". 'గుర్తుకొస్తున్నాయి' అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో డబ్బింగ్ మొదలు పెట్టింది అనసూయ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ మీడియాతో వెల్లడించింది. ఆచార్య, పుష్ప, ఖిలాడీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ ఫ్లాష్‌బ్యాక్‌లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందట! సరికొత్త పాయిట్‌తో వస్తున్న తమ సినిమా అందరినీ ఆకట్టుకోవడమే గాక పక్కాగా సక్సెస్ సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శకనిర్మాతలు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామన్నారు.
ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తోంది. ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట! ఈ చిత్రానికి శ్యామ్ అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్‌కు తీసుకువెళ్తాయంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఫ్లాష్ బ్యాక్' మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి.రమేష్ పిళ్ళై రూపొందిస్తున్న ఈ మూవీకి డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
(చదవండి: చీర కట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment