
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటడ్ మూవీగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది‘ పుష్ప: ది రైజ్’ చిత్రం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, టీజర్ ట్రైలర్‌లో సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ఈ చిత్రంపై అంచనాలను ఓ రేంజ్‌కి తీసుకువెళ్లాయి. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ప్రీ రిలీజ ఈవెంట్‌లో హీరోయిన్‌గా రష్మిక ఓవర్ చేసిందని నెటిజన్లు ఓ రేంజ్‌లో నెట్టింట కామెంట్లు పెట్టారు. తాజాగా కన్నడ మీడియా.. రాష్ట్రానికి చెందిన రష్మిక తన పాత్రకు డబ్బింగ్ మాతృభాషలో చెప్పలేదని ఒక అంశాన్ని లేవనెత్తింది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు కానీ నటి సోషల్ మీడియాలో మాత్రం రష్మికపై ట్రోల్స్ ఆగడం లేదు. నెటిజన్లు మాత్రం.. రష్మిక తెలుగు, ముఖ్యంగా చిత్తూరు యాస నేర్చుకోవడానికి చాలా కష్టపడింది.
ఈ సినిమాను కన్నడలో డబ్ చేయడానికి కొంత సమయం తీసుకోకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. రష్మిక ఒకేసారి అనేక ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. పైగా ఎవరూ ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని మనమే అర్థం చేసుకోవాలి. అన్నింటికంటే మించి, రష్మిక ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. దీంతో పాటు రెండవ భాగానికి డబ్బింగ్ మిస్ చేయనని హామీ ఇచ్చింది. ఏది ఎలా ఉన్నా నెట్టింట రష్మిక పై ట్రోల్స్, కామెంట్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.
చదవండి: Heroine Childhood Pic: ఒకప్పుడు అందంతో కుర్రకారు మతిపోగొట్టిన ఈ ‘రాక్షసి’ ఎవరో గుర్తు పట్టారా?
Comments
Please login to add a commentAdd a comment