Sooseki Song: అదిరిపోయిన ‘కపుల్‌ సాంగ్‌’ | Pushpa 2 The Rule Movie Sooseki Full Lyrical Video Song Out, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 Sooseki Song Lyrical Video: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Wed, May 29 2024 11:14 AM | Last Updated on Wed, May 29 2024 4:56 PM

Pushpa 2: Sooseki Song Out

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్‌ విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ అయింది.  ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదల కానుంది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement