
సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాడు గని. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ మూవీలో గని అనే బాక్సర్ పాత్రలో కనిపిస్తారు వరుణ్‌తేజ్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేశారు. తాను డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు వరుణ్.
కాగా మార్చి 18న ‘గని’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొత్త రిలీజ్ డేట్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయట. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment